రా ష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణకు కాంగ్రెస్ ప్రభు త్వం కట్టుబడి ఉందని ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో రూ. 10 కోట్లతో చేపట్టిన శ్రీఉగ్రనరసింహస్వా మి ఆ లయ పునర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పు ష్కరాలను అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాల పనులకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని కో టిలింగాల, ధర్మపురి క్షేత్రాల అభివృద్ధ్దికి రూ.2 00 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

ధర్మపురి నియోజకవర్గంలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఇప్పటికే రూ.117 కోట్లు విడుదల చేశామని, మరో రూ.80 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని అన్నారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో రూ.2.48 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సబ్ స్టేషన్ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాల్లో భా గంగా ధర్మపురి వద్ద గోదావరిలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.22.16 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మపురి, కోటి లింగాలలో రూ.58.55 కోట్లతో తొమ్మిది రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.