మన తెలంగాణ / హైదరాబాద్ : అత్యాధునిక సాం కేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అ నుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కె చందన, సహ వ్యవస్థాపకుడు, ము ఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) భరత్ డాకా మం గళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మ ర్యాదపూర్వకంగా కలిశారు.భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్- 1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా,

చైనా తర్వా త ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్ర యోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భార త్ నిలిచిందని తెలిపారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పు రోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన- అ భివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వ, -ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి అభినందించారు. వారు సాధించిన విజయం భారతదేశా న్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుందని ముఖ్యమంత్రి ప్రశంసించారు.