
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో శనివారం ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తోన్న 480 ఖాతాలను బ్లాక్ చేశామని ఢిల్లీ పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల గురించి సోషల్ మీడియాలో భారీగా నకిలీ వార్తల ప్రచారం జరుగుతోందని, దీంతో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. “ప్రజలు నకిలీ, వాస్తవ సమాచారానికి మధ్య తేడా గుర్తించ గలిగేలా , మా సోషల్ మీడియా ఖాతాల్లో ఏఐ, డీప్‌ఫేక్, ఎడిట్ చేసిన క్లిప్‌లు, తప్పుదోవ పట్టించే పోస్ట్‌ల గురించి నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం” అని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.











