
సుప్రీం తీర్పుతో కీలక ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకి
సీతమ్మ సాగర్‌తో 36 టిఎంసిల నీటి నిల్వ సామర్ధం
సీతారామ లిఫ్ట్‌తో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి తుమ్మల
మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి రి జర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు రా ష్ట్ర సాగునీటి రంగానికి ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల అంశంలో ప్ర త్యేక చొరవ చూపి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి తుమ్మల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీ ర్పుతో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమున్న సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సీతమ్మసాగ ర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు రాష్ట్ర జలవనరుల చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. సాగునీటి విస్తరణతో పాటు విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపు వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్రాజెక్టు అందిస్తుందని చెప్పారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా 36.57 టిఎంసిల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఏ ర్పడుతుందని మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్ర జలవనరుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు కీలక ఆధారంగా నిలుస్తుందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భద్రత లభిస్తుందని మం త్రి వివరించారు.
ఇందులో 3.28 లక్షల ఎకరాలకు కొ త్తగా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. అలాగే నా గార్జునసాగర్‌లో నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో లేదా క రువు పరిస్థితుల్లో 3.45 లక్షల ఎకరాల నాగార్జునసాగర్ ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ నీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా 282.80 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఇది కీలక పాత్ర పోషించడంతో పాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి దోహదపడుతుందని అన్నారు.
భూగర్భ జలాల పెంపు.. వరద నియంత్రణ
ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నదికి ఇరువైపులా సు మారు 50 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, బోర్లు, బావుల్లో నీటి లభ్యత మె రుగుపడుతుందని మంత్రి తెలిపారు. అలాగే గోదావరి వెంట కరకట్టల నిర్మాణం ద్వారా అశ్వాపురం, మణుగూ రు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పంటలు, గ్రా మాలు వరద ముప్పు నుంచి రక్షణ పొందుతాయని వివరించారు. సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కేవ లం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రైతులకు సాగునీటి భరోసా, రాష్ట్రానికి అదనపు విద్యుత్ ఉత్పత్తి, భూగర్భ జలాల పెంపు, వరద నియంత్రణ, ప్రాంతీయ స మగ్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని మంత్రి తు మ్మల పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతాంగం తో పాటు రాష్ట్ర ప్రజలందరికీ దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.











