
ముంబై: దులీప్ ట్రోఫీ 2026కు సన్నహాలు చేస్తోంది బిసిసిఐ. ఈ దేశవాళిలో తలపడనున్న సెంట్రల్ జోన్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు సారథి రజత్ పాటిధార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టు యాజమాన్యం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఉప సారధిగా ఎంపికయ్యాడు. సారాంశ్ జైన్, అమన్ మోఖడె, జీషన్ అన్సారీ, కునాల్ ఛండేలా, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆర్యన్ జుయల్, ఆయూష్ పాండే, హర్ష్ దూడె, యాష్ ఠాకూర్ వంటి వారు జట్టులో స్థానం కలిపించారు. సౌరవ్ రావత్, మయాంక్ మిశ్రా, అమన్‌దీప్ ఖరె, భార్గవ్ మోరాయ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఈనెల 23న ప్రారంభంకానున్న ఈ టోర్నీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, ట్రోఫీలో నార్త్ ఈస్ట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌తోపాటు వెస్ట్ జోన్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సెంట్రల్ జోన్ జట్టు గతేడాది జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ జట్టును ఓడించి టైటిల్ గెలుకుంది. తొలిసారి ఛాంపియన్ నిలిచిన సెంట్రల్ జోన్ రజత్ పాటిధార్ సారథ్యం వహించి, 382 పరుగులతో రాణించి జట్టు గెలుపులో కీలక భూమికపోషించాడు.











