కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, కియారా అడ్వాణీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే అని చిత్ర యూనిట్ పదే పదే చెబుతూ వస్తోంది. హీరో యశ్ కూడా కేవలం పెద్దలు మాత్రమే ఈ సినిమా చూడాలని సూచించాడు.

కాగా, ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా సినిమాలో ఎలాంటి సన్నివేశాలను కూడా సెన్సార్ బోర్డు తొలగించలేదట. కానీ, సినిమాకు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చిందట. ఇక సినిమా నిడివి వచ్చి 3 గంటల 12 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. అయితే కన్నడ భాషలో కేవలం రెండు, మూడు పదాలు మాత్రమే మ్యూట్ చేశారట. దీంతో సెన్సార్ బోర్డుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.