
ప్రయాణికుల నుంచి వస్తున్న పలు విజ్ఞప్తిల మేరకు ఆర్టిసి రాత్రి సమయాల్లో పలు మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచింది. ఇందులో భాగంగా రూట్ నెం ః 222ఏ పటాన చెరు , కోటీ మార్గంలో ఆబిడ్స్,లక్డికాపూల్, కేర్ ఆసుపత్రి, బేగం పేట, కొండాపూర్ క్రాసర్ రోడ్, హఫీజ్ పేట, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరం గూడ మీదుగా థర్డ్ షిఫ్ట్ ( అర్దరాత్రి) 4 బస్సులను ముషీరాబాద్ డిపో నుంచి 2, మియాపూర్ డిపో నుంచి రెండు బస్సులు నడపున్నట్లు ఆర్టిసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కోటీ నుంచి పటాన చెరుకు మొదటి అర్ధరాత్రి 11.40 నిమిషాలకు ఉండగా, చివరి బస్సు ఉదయం 4.55లకు ప్రతి 45 నిమిషాలకు అందుబాటులో ఉంటుందన్నారు. అదే విధంగా రూట్ నెం ః 218 అఫ్జల్‌గంజ్ నుంచి పటాన్ చెరువ మార్గంలో థర్డ్‌షిఫ్ట్‌లో భాగంగా రెండు బస్సులను, కాచిగూడ డిపో నుంచి 1 ఒక బస్సు అదే విధంగా మియాపూర్ డిపో 2 నుంచి 1 బస్సును ప్రయాణికులు సౌకర్యం కోసం నడుపుతున్నట్లు తెలిపారు.
అఫ్జల్‌గంజ్ నుంచి మొదటి బస్సు అర్దరాత్రి 11.25 నిమిషాలకు ఉండగా, చివరి బస్సు ఉదయం 3 గంటల 5 నిమిషాలకు అంటే 1.15 గంటల తేడాతో అందుబాటులో ఉంటుందన్నారు. అదే విధంగా రూట్ నెం ః 219 (సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరు) మార్గంలో నడస్తున్న ఈ బస్సు సికింద్రాబాద్, ప్యారడైజ్,తాడ్‌బండ్, బోయిన్ పల్లి,బాలానగర్,క్రాస్ రోడ్,ఐడిపిఎల్ ,ప్రశాంత్‌నగర్, కూకట్పల్లి, కేపిహెచ్బి, హైదర్‌నగర్, గంగారం, లింగంపల్లి, రామచంద్రాపురం, తదతర ప్రాంతాల మీదుగా పటాన్ చెరు చేరుకుంటుందని వీటి కోసం థర్డ్‌షిఫ్ట్‌లో భాగంగా కంటోన్మెంట్ డిపో నుంచి 1 బస్సు, మియాపూర్ 2 డిపో నుంచి 1 బస్సును ప్రయాణికులు సౌకర్యం కోసం నడపుతున్నట్లు చెప్పారు. రూట్ నెం ః 290యు (హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్) ధర్డ్షిఫ్ట్లో భాగంగా 3 బస్సులు నడుపుతామని, హయత్‌నగర్ డిపో నుంచి రెండు విద్యుత్ బస్సులను, కంటోన్మెంట్ డిపో నుంచి ఒక విద్యుత్ బస్సును ప్రయాణికులు సౌకర్యం కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
రూట్ నెం ః 195 డబ్లూ (బాచుపల్లి , వేవ్‌రాక్) మార్గంలోనిజాంపేట, నిజాం పేట క్రాస్ రోడ్,జెఎన్టీయు, హెటెక్‌సిటీ, ఈఎన్ఐసి, ఇందిరానగర్, ఇన్ఫోసిస్, ఇన్పోటిక్, మీదుగా థర్డ్ షిష్ట్ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ 2 డిపో నుంచి 3 విద్యుత్ బస్సులు నడపున్నట్లు తెలిపారు. 10 హెచ్ ( కొండాపూర్.. సికింద్రాబాద్)ధర్డ్షిప్ట్లో భాగంగా రాత్రి 22..55 నిమిషాల నుంచి ఉదయం 3.40 వరకు ప్రతి 50 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులు సౌకర్యం కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ బస్సులు సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.











