
మన తెలంగాణ/హైదరాబాద్ః వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి, కౌన్సిల్ కార్యదర్శి వి. నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. 7న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన బిఏసి సమావేశమై సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంతో పాటు అజెండానూ ఖరారు చేస్తారు.











