
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి ల్యాండింగ్ కావాల్సిన ఓ విమానరం టేకాఫ్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం రాత్రి 20 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ అయ్యే సమయానికి క్లియరెన్స్ లేకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకొన్నారు. ఈ విమానంలో సిఎం రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 8.35 నిమిషాలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.











