2027 ప్రపంచకప్‌నకు మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ఈసారి మెగా ట్రోఫీని అందుకోవాలని అన్ని జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే టీం ఇండియాలో మాత్రం ఒక కొరత ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. కీలక ఆటగాళ్లను జట్టును నుంచి దూరం పెట్టారని అన్నారు.

‘‘దూబే, హర్షిత్ రాణా వంటి ఆలటగాళ్లు ఆల్‌రౌండర్లు కాదు. వీరిని ఆల్‌రౌండర్లు అంటే.. నాకు నేను గొప్ప ఆల్‌రౌండర్‌ను అని చెప్పొచ్చు. జట్టులో హార్థిక్ ఒక్కడే నిజమైన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్ రౌండర్. అతడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు.. కొన్ని ఓవర్లు వేయగలడు.

మరోవైపు రవీంద్ర జడేజా వన్డేల నుంచి పూర్తిగా వైదొలగాడని నేను అనుకోవడం లేదు. 2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. అతడు ఓ సైలెంట్ కిల్లర్. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిచలేదు. టెస్టుల్లో అద్భుతంగా రాణించినా అతడికి వన్డే జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. రాణిస్తే జట్టులోకి కూడా తీసుకవావాలి’’ అని శ్రీకాంత్ అన్నారు.