
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణను ఆగస్టు 17కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంలో న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా ఈ కేసులోని ముగ్గురు నిందితులు కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.
హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం విదితమే. విచారణలో భాగంగా ఛార్జ్జిషీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు, ఎలక్టానిక్ ఆ రాలు, సిసిటివి ఫుటేజీలను తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయస్థానం చార్జిషీట్‌లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, వీడియో ఫుటేజీలు, పత్రాల కాపీలను తదుపరి విచారణ నాటికి నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.











