
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం మండలంలోని సజ్జాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ డిసిఎం అదుపుతప్పి, ఆటోను ఢీకొట్టి.. దానిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మహిళ సంఘటనాస్థలంలోనే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.










