
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి తాత మధు స్పీకర్‌ను ఉద్దేశిస్తూ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్‌పై తాత మధు చేసిన వ్యాఖ్యల వీడియోను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తన చాంబర్‌లో మంత్రులు, ఎంఎల్‌ఎలు, బిజెపి సభ్యులకు చూపించారు. తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించారు. తాత మధు వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో సభా వ్యవహారాలు, రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
నా మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నా: తాత మధు
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మార్ అంటే తనకు గౌరవముందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి తాతా మధు అ న్నారు. తాను అనని మాటలను తన కు ఆపాదించడం సరికాదని చెప్పా రు. స్పీకర్‌ను తానేమీ అనలేదని, ఆ యనను అన్నట్లు భావిస్తే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు. తన మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. స్పీకర్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దుమారం రేగిన నేపథ్యంలో తాత మధు స్పందించారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలపై పోలీసులు దాడి చేశారని, తన డొక్కలో పిడిగుద్దులు గుద్దారని మండిపడ్డారు.అయినా తాను ఏం మాట్లాడలేదని చె ప్పారు. మహిళా ఎంఎల్‌ఎలపై జరిగిన ఘటనకు హోం శాఖ మంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.













