మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఇసి) నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తితో గడువు పొడిగించింది. ముందుగా ఈ నెల 16 వ రకు ఉన్న గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు తెలిపింది. దీంతో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం అక్టోబర్ 7 వరకు అవకాశం ఉం టుంది. ప్రస్తుతం క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకర ణ అనంతరం వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం పూర్తయిన తర్వాత నవంబర్ 9న తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.