తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సర్  నమోదు ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సర్ ఫారం నింపి బీఎల్ ఓ లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తప్పనిసరిగా సర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ వివరాలను సరిచూసుకొని నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.