
‘పెద్ది’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా సుకుమార్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా చరణ్, సుకుమార్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న మరో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అది కూడా ‘పుష్ప’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్‌గా ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడుస్తోంది. అంతేకాక.. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్‌ఫర్మెన్స్‌కు స్కోప్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారట. 2027 చివర్లో కానీ.. 2028 మార్చిలో కానీ.. ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నలు జరుగుతున్నట్లు సమాచారం.











