మన తెలంగాణ/హైదరాబాద్: సామాజిక సేవ, క్రీడలు, సాహిత్యం, విద్య, సంస్కృతి, వ్యాపార సహా భిన్న రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలకు సుయశక్తి అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి తమిళనాడు మంత్రులు విల్సన్, రాజమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక క్రీడల్లో రాణిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా అథ్లెట్లు కూడా సుయశక్తి అవార్డులను అందుకున్నారు. క్రీడలతో పాటు పలు రంగాల్లో రాణిస్తున్న అరుణ గుహాన్, ఫర్హానా సుహైల్, నైనా రెడ్డి, అనుపమ కదాంబి, రాజేశ్వరి, రజిని రెడ్డి తదితరులు పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. శక్తి మసాలా వ్యవస్థాపకులు పి.సి.దురైసామీ, డైరెక్టర్ శాంతి దురైసామీలు అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు పాల్గొన్నారు.