
షిండే వర్గంలో రెబెల్ ఎంపిల విలీనానికి గుర్తింపు
టిఎంసి రెబెల్ వర్గానికి లోక్‌సభలో ప్రత్యేక సీట్లు
లోక్‌సభ కార్యాలయానికి సభాపతి ఓంబిర్లా ఆదేశాలు
న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలు రెబెల్ వర్గాల్లో విలీనాన్ని శనివారంనాడు ఆమోదించారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపిలు మహారాష్ట్ర డిప్యూటీ సిఎం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో విలీనాన్ని గుర్తించారు. లోక్‌సభలో వారికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో 20మంది టిఎంసి చట్టసభ సభ్యులు మమతకు గుడ్‌బై చెప్పి నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్‌సిపిఐ) అనే చిన్న పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారికి కూడా లోక్‌సభలో ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వాలని లోక్‌సభ కార్యాలయానికి సూచించారు. అయితే ఎన్‌సిపిఐలో విలీనాన్ని స్పీకర్ గుర్తించినట్లా, లేదా? అన్న విషయంపై లోక్‌సభ కార్యాలయ వర్గాలు స్పష్టతనివ్వలేదు.











