ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే. భారత ఓపెనర్ షఫాలీని ఔట్ చేసిన ఆమె డగౌట్ వైపు చేయి చూపిస్తూ దురుసుగా ప్రవర్తించింది. అయితే ఈ ఘటనపై ఐసిసి స్పందించింది. ఫాతిమా కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు ఐసిసి నిర్ధారించింది. ఈ మేరకు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిగిమానా విధించింది. అలాగే ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.

ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ల్ ప్రకారం, బ్యాటర్2ను ఔట్ చేసిన తర్వాత అతడు లేదా ఆమెను అవమానించేలా, ప్రేరేసించే భాష, చర్యలు, సంజ్ఞలు చేయడం చేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ నిబంధన కింత ఫామిమాపై లెవల్- 1 ఉల్లంఘన నమోదైంది. ఇది గత 24 నెలల్లో ఫాతిమా చేసిన రెండో నేరంగా ఐసిసి పేర్కొంది. దీంతో ఆమె డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది. 2025 ఆగస్టు 6న డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టి-20లో ఆమెకు ఓ డీమెరిట్ పాయింట్ లభించింది.