
కామెడీ సినిమాలతో ప్రేక్షకులను నవ్వించడంలో యువ హీరో శ్రీ విష్ణు ఎప్పుడు ముందుంటాడు. అతడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ ఈ సినిమాలో హీరోయిన్. జానకిరామ్ మారెల్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ బుల్గనిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. శ్రీ విష్ణు మార్క్ కామెడీతో ఈ టీజర్ నవ్వులు పూయిస్తుంది. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతంలో 1992లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా, ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కానుంది. మీరు కూడా ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ చూసి హాయిగా నవ్వుకోండి...








