
అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’. 2017లో వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. 2018లో శ్రీదేవి చనిపోయిన తర్వాత ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటిస్తోంది.
‘ది ఆర్చీస్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఖుషీ.. ఆ తర్వాత ‘నాదానియాన్’, ‘లవ్యాపా’ వంటి చిత్రాల్లో నటించారు. కానీ, ఆమెకు సక్సెస్‌ను అందించలేకపోయాయి. దీంతో మామ్ 2తో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో.. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాని నోయిడా, గ్రీస్ ప్రాంతాల్లో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.











