కొలంబో: శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌కి ముందు భారత్‌, శ్రీలంక XIతో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక XI రెండో ఇన్నింగ్స్‌ను 200/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక XI 363/8 పరుగులు చేయగా.. భారత్ 357/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇక శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ని ఆరు పరుగుల ఆధిక్యంతో ప్రారంభించింది. శ్రీలంక బ్యాటర్లను భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కానీ, మధుశంక (83) అద్భుతమైన అర్థశతకంతో చెలరేగిపోగా.. ధనంజయ 46, బండారా 35 పరుగులు చేశారు. దీంతో శ్రీలంక 45 ఓవర్లలో 200/6 పరుడుగ డిక్లేర్ చేసింది. భారత బౌలింగ్‌లో జడేజా, గుర్నూర్ చెరి రెండు వికెట్లు, సిరాజ్, ప్రశిద్ధ్ తలో వికెట్ తీశారు.