నీట మునిగిన సంగమేశ్వర ఆలయం

 మరో ఎనిమిది నెలల తర్వాత పునర్దర్శనం

 సోమశిలకు పోటెత్తిన పర్యాటకులు

మన తెలంగాణ/ కొల్లాపూర్: శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ఉన్న చారిత్రక సోమశిల సంగమేశ్వరం దేవాలయం జలాధివాసానికి చేరువవుతోంది. సప్త నది సంగమమైన సంగమేశ్వర ఆలయం కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో నీట మునిగిపోనున్నది. సోమశిల వద్ద కృష్ణానదీ జలాలు పెరుగుతుండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున సోమశిలకు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

నదీ ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే నదిలో నీటిమట్టం పెరిగి సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఒకవేళ మునిగితే ఎనిమిది నెలల తర్వాతే భక్తులకు దర్శనం కానుంది. ప్రాజెక్టులో నీటిమట్టం 867 అడుగులకు చేరితే సంగమేశ్వరాలయం పూర్తిగా జలమయం కానున్నది.