మంచిర్యాల: సింగరేణి చిత్రలో మరో మైలురాయ వచ్చి చేరింది. ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే వ్యాగన్ తెలంగాణకు చేరింది. మంచిర్యాల జిల్లా జైపుర్ సింగరేణి ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి బొగ్గు రైలు చేరుకుంది. సింగరేణి అధికరారులు రైలుకు స్వాగతం పలికారు. 59 వ్యాగన్ల ద్వారా 4 వేల టన్నుల జి-10 గ్రేడ్ బొగ్గు వచ్చింది. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం, కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టం అని అన్నారు.