ఐపిఎల్ 2026లో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్‌ ఎంచుకుని.. ముందుగా లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ముంబై బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ