
పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కార్యసాధక బృందం
ఇస్రో మాజీ ఛైర్మన్ సోమ్‌నాథ్ సహా ఐదుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కఠిన నిబంధనలతో నేడు పార్లమెంట్‌లో కొత్త బిల్లు
నీలేకని నివేదిక ఆధారంగా భవిష్యత్తులో భరోసా కల్పించే చర్యలు
ప్రధాని మోడీ మరో వీడియో సందేశం
న్యూఢిల్లీ: దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్ఠంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సి న సంస్కరణలపై ఈ బృందం అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని తెలిపా రు. ఆ నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల వి శ్వసనీయతకు భరోసా కల్పించే చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఆదివా రం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వి ద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారు జైళ్లలో ఉన్నారని, వారి కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.
కఠిన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా సోమవారం పార్లమెంటులోనూ ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో కొనసాగిన ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ముగిసిన మరుసటి రోజే ప్రధాని ఈ ప్రకటన చేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సమూల మార్పులపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు.
“మన పరీక్షల వ్యవస్థ విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలి. పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ బృందం పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుంది. అది ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతకు భరోసా కల్పించే చర్యలను వీలైనంత త్వరగా చేపడతాం” అని మోదీ వివరించారు.
టాస్క్‌ఫోర్స్‌లో ప్రముఖులు
నందన్ నీలేకనితోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులను టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా నియమించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోపాటు నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా దేశ పరీక్షల వ్యవస్థను మెరుగుపరిచేందుకు వీరు సూచనలు చేయనున్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్‌లాల్ మీనా ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.
నందన్ నీలేకని ఇ-గవర్నెన్స్ రంగంలో విశేష అనుభవం కలిగిన సాంకేతిక నిపుణుడు. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘ఈ-గవ్ ఫౌండేషన్’ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పట్టణ పాలనను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు పట్టణ స్థానిక సంస్థలకు అవసరమైన సాంకేతిక వేదికల రూపకల్పనపై ఈ సంస్థ దృష్టి సారించింది. రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ బాధ్యతల్లో అనుభవం ఉన్న నీలేకని.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వ్యవస్థాపక ఛైర్మన్‌గానూ పనిచేశారు.
భారీ స్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల్లో సాంకేతికతను వినియోగించడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న మరో సంస్థ ‘ఏక్‌స్టెప్ ఫౌండేషన్’ డిజిటల్ వేదిక ద్వారా లక్షలాది మంది చిన్నారుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ఐఐటీ బాంబే నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన నీలేకని.. పద్మభూషణ్‌తోపాటు జోసెఫ్ షుంపీటర్ ప్రైజ్ సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు.








