
నెలాఖరులో అదనపు చార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్
నేతల పేర్లు చేర్చాలా? వద్దా? అన్నదానిపై మల్లగుల్లాలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: రాష్ట్రంలో సంచల నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలు పు తిరగబోతున్నట్లు తెలిసింది. దర్యాప్తు పూర్తిచేసిన సిట్ అధికారులు త్వరలోనే కోర్టులో అదనపు చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. రా ష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ నా యకులు, ప్రముఖులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసి విచారణ చేయించింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు 600 మందికిపైగా నోటీసులు జారీచేసి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈ నెల చివరలో అదనపు చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అదనపు చార్జిషీట్‌లో రాజకీయ నాయకుల పేర్లు చేర్చాలా, వద్దా? అనే అంశంపై సిట్ అధికారులు తర్జనభర్జ న పడుతున్నట్లు తెలిసింది.
అయితే, ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంపై ఇప్పటివరకు సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. టెలిఫోన్ యాక్ట్ జోడించి చార్జిషీట్ వేయనున్నట్లు తెలిసింది. ఈ యాక్ట్‌ను జోడించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్‌రావు టీం ట్యాపింగ్ చేసినట్లు సిట్ ఆఫీసర్లు గుర్తించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగిన బైపోల్ సమయాల్లోనూ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తదుపరి దర్యాప్తు సాంకేతికంగా నిలబడేలా సిట్ చార్జిషీట్ రూపొందిస్తున్నట్లు తెలిసింది.











