తమిళనాడు లోని అత్యంత కీలకమైన కొళత్తూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. అయితీ ఈ ఎన్నికల్లో సిఎం స్టాలిన్ ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం పొందారు. ఈ ఫలితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ద్రవిడమున్నేట్ర కజగం అధినేత స్టాలిన్ కన్నా బాబుకు 9492 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2011 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో కొళత్తూరు నియోజకవర్గం ఏర్పాటైంది.

అప్పుడు డిప్యూటీ సిఎంగా ఉన్న స్టాలిన్ కేవలం 2734 ఓట్ల తేడాతో ఏఐఎడిఎంకె అభ్యర్థి సైదై దురైస్వామిని ఓడించారు. 2016,2021 ఎన్నికల్లో కూడా క్రమంగా 37730,70384ఓట్ల ఎక్కువ మెజార్టీలతో స్టాలిన్ గెలుపొందారు. అంతకు ముందు తౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి స్టాలిన్ పోటీ చేసేవారు. ఆ తరువాత కొళత్తూరు నియోజకవర్గం మారారు. గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన పాత నియోజకవర్గం నుంచి గెలిచారు.