హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జల ఉద్యమం చేస్తామంటున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ను జల సమాధి చేశారని అన్నారు. కెటిఆర్ కు చామల కౌంటర్ ఇచ్చారు. జిఆర్ఎంబి మీటింగ్ ఎపి ప్రభుత్వం పెట్టిందని, జిఆర్ఎంబి మీటింగ్ కు వెళ్లి ప్రతిపాదనలను వ్యతిరేకించాలా? వద్దా? అని మాజీ సిఎం కెసిఆర్ రాయలసీమ వెళ్లి వైసిపి మాజీ మంత్రి ఆర్ కె రోజా ఇంట్లో చేపల పులుసు తినలేదా? అని రాయలసీమను రతనాల సీమ చేస్తామని కెసిఆర్ అనలేదా? అని ఎపి మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిను ప్రజాభవన్ కు పిలిచి కెసిఆర్ బిర్యానీ పెట్టారని, గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని జగన్ తో కెసిఆర్ అన్నారని తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుతో అవగాహన ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని బిఆర్ఎస్ చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం తేవాలనే రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ తెచ్చారని పేర్కొన్నారు. కెటిఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాలని, కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు లేదు? అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.