
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ఎండ తీవ్రతతో పాటు వడ గాల్పులు కూడా తోడవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతో 34 మంది చనిపోయారు. ఖమ్మం(7), భద్రాద్రి కొత్తగూడెం(5), ఆదిలాబాద్(3), జయశంకర్ భూపాలపల్లి(3), జగిత్యాల(2), వరంగల్(2), మహబూబాబాద్(2), నల్లగొండ(2), పెద్దపల్లి(2), సంగారెడ్డి(1), నిజామాబాద్(1), హనుమకొండ(1), సూర్యాపేట(1), కరీంనగర్(1) మృతి చెందారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏకం గా 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మా ర్కును దాటడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గు రిచేస్తోంది. ఇక్కడి ప్రజలు మండుతున్న ఎండలతో తీవ్ర అవస్థలు ప డుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ జన సం చారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. రా బోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకా శం ఉందన్న హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భానుడి ఉగ్ర రూపంతో పలుచోట్ల గత పదేళ్ల మే నెల రికార్డులు బద్దలు అయ్యా యి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్ల మే నెల లో అత్యధిక ఉష్ణో గ్రత రికార్డు 2019 మే 24, 29, 30 తేదీల్లో 46.3 డిగ్రీలుండగా బుధవారం దానిని అధిగమించి దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీ లు నమోదైంది. అలాగే హనుమ కొండలో గత పదేళ్ల రికార్డు 2017 మే 22, 23 తేదీల్లో 45 డిగ్రీలుంటే తాజాగా 46.4 డిగ్రీలతో ఊహించని కొత్త రికార్డు నమోదైంది. కుమురం భీం ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో తీవ్ర వడగాలులు, ఇతర జిల్లాల్లో వడగాలులు వీచినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.












