
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించునున్నట్లు తెలిపింది. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఇసిఐ తుది గడువు విధించింది. ఇప్పటికే ఎపిలో సర్ గడువును ఈనెల 24 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.









