ఇప్పటివరకూ ఎందరో పురుష, మహిళ క్రీడాకారుల బయోపిక్‌లు మనం తెరమీద చూశాం. అయితే చాలామందికి తెలియని ఓ మహిళ అథ్లెట్ బయోపిక్ త్వరలో ఒటిటిలో సందడి చేయనుంది. ఆ చిత్రమే ‘సుమో దీదీ’. భారత దేశ తొలి సుమో రెజ్లర్ ‘హేతల్ దవే’ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమే ఇది. ఈ చిత్రానికి జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు. ‘హేతల్ దవే’ పాత్రలో శియం భగ్నానీ నటించారు. టోక్యో ఫిలిమ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్ సహా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా త్వరలో ‘జి5’ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో

తాజా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘‘నువ్వు బరువు తగ్గకపోతే, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు’ అంటూ కుటుంబ సభ్యులు హేతల్ దవేని కుటుంబ సభ్యులు ప్రశ్నించడం ఈ టీజర్ ప్రారంభం అవుతోంది. చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే ఇష్టపడే హేతల్ దవే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొనే వరకూ ఆమె ఎలాంటి కష్టాలు, అవమానాలు ఎదురుకున్నారు అనేది సినిమాలో ఎలా చూపిస్తారో.. టీజర్‌లో ఓ శాంపిల్‌గా చూపించారు. ఇక పోతే ముంబై‌కి చెందిన హేతల్ దవే.. భారతదేశంలోనే తొలి సుమో రెజ్లర్ మాత్రమే కాదు.. ప్రపంచంలో టాప్-5లో ఒకరిగా చరిత్ర సృష్టించారు.