
తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు బోల్తా పడింది. తిరుపతి నుంచి కారులో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులు తిరుమలకు బయలుదేరారు. రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయ, ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.











