బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు జన్మదినం సందర్భంగా ఆయన సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. తన జన్మదినం వేళ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు రాంచందర్‌రావు ప్రకటనలో పేర్కొన్నారు.