తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా నెలకొంది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భారీగా వెంకన్న భక్తులు వస్తుండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచివున్నారు.

ఈ క్రమంలో టోకెన్లు లేని భక్తులకు స్వామి సర్వదర్శనానికి 12 గంటల నుంచి 14 గంటల సమయం పడుతుంది. ఇక, బుధవారం శ్రీవారిని 74,471 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 31,319 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.68 కోట్లుగా ఉన్నట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.