
చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం(మే 10) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం టివికె అధినేత విజయ్.. సోమవారం ప్రతిపక్ష నేత, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన సిఎం విజయ్ కు ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికారు. తర్వాత సిఎం విజయ్, స్టాలిన్ ఇరువురు శాలువాలతో ఒకరినొకరు సత్కరించుకున్నారు. సిఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ మర్యాదపూర్వకంగా స్టాలిన్ కు కలిసినట్లు టివికె పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టివికె 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో కాంగ్రెస్ తోపాటు చిన్న పార్టీల మద్దతు విజయ్ నేతృత్వంలోని టివికె.. తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, మొదట ఏ పార్టీ.. టివికెకు మద్దతు తెలపకపోవడంతో మూడు రోజులపాటు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ చిన్న పార్టీలను ఒప్పించారని డిఎంకె అధికార ప్రతినిధి ఎ. సర్వణన్ తెలిపారు.














