న్యూఢిల్లీ : దేశంలో సోమవారం పాంచ్ పటాకా పేలింది. నాలుగు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేర ళ, అసోంలలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడింది. సర్ ఇతరత్రా వివాదాలు ఏ విధంగా ఉన్నా ఈసా రి సగటు ఓటరు ఎక్కువగా పరివర్తన్‌కు తీర్పు వెలువరించారు. sతమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెం గాల్ సిఎం మమత బెనర్జీ తమ తమ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. స్టాలిన్ కొళత్తూరు స్థానంలో టివికె అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఇక బెంగాల్ సిఎం మమత బెనర్జీ తమ సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి ఓడారు. ఇక్కడ బిజెపి నేత సు వేందు అధికారి చేతిలో పదకొండు వేలకు పైగా ఓట్ల తేడాతో

ముఖ్యమంత్రి మమత పరాజయం చెందారు. పశ్చిమ బెంగాల్‌లో 293 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బిజెపికి2 05, టిఎంసికి 74, కాంగ్రెస్‌కు 2, వామపక్షాలకు 2, ఇతరులకు 2 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వెలువడ్డ ఫలితాల సరళితో బిజెపి ఆధ్వర్యంలో ఉత్తర భారతం, తూ ర్పు భారతం అంతా కాషాయ రంగు విస్తరించుకుంది. అన్నింట్లోకి అత్యంత నిర్ణయాత్మక గెలుపు పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి అధికారానికి బిజెపి గండికొట్టడం అయిం ది. మమత బెనర్జీ దీర్ఘకాలిక ఆధిపత్య పాలనా రాజకీయాలకు బిజెపి చెక్ పెట్టింది. సొంతంగా తన జెండాను ఎగురేసుకుంది. అమిత్ షా, ప్రధాని మోడీ పట్టువీడని రీతిలో సాగించిన ఎన్నికల ప్రచారం బిజెపి విజయానికి దారితీసింది. ఇక అసోంలో మరోమారు బిజెపి గెలుపు ఖాయం అయింది.

తమిళనాడులో కీలక మార్పు విజయ్ గెలుపు

తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన టివికె బలీయ రీతిలో అధికారానికి చేరువగా నిలిచింది. తమిళనాడులో డిఎంకెకు 74 స్థానాలు, టివికెకు 107, అన్నాడిఎంకెకు 52 స్థానాలు వచ్చాయి.ఎట్టి పరిస్ధితుల్లోనూ విజయ్ సిఎం అయ్చేందుకు అనువైన మార్గం ఏర్పడింది. అవసరమైన సాధారణ మెజార్టీ బలాన్ని అందించేందుకు ఇటు అన్నాడిఎంకె, అటు కాంగ్రెస్ కూడా ముందుకు రావడం కీలక పరిణామం అయింది. కేరళలో ఎన్నకల ఫలితాలతో అక్కడ వామపక్షం అధికారం తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ నాయకత్వపు యుడిఎఫ్ విజయం దిశలో ముందుకు వచ్చింది. కేరళలో మార్పునకు ఓటరు తీర్పు వెలువరించారు.

ఇక పుదుచ్చేరిలో బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ అధికారం కాపాడుకుంది. ఇక్కడ కాంగ్రెస్ సారధ్య కూటమి తన ప్రభావం చూపలేకపోయింది. మొత్తం మీద ఈ సారి ఎన్నికలలో ముందు నుంచి పశ్చి మ బెంగాల్, తరువాతి క్రమంలో తమిళనాడులలో ఫలితాలపైనే జాతీయ స్థాయిలో దృష్టి కేంద్రీకృతం అయింది. ఈ దిశలో బెంగాల్‌లో అధికారం చేజిక్కించుకుని బిజెపి ఎక్కువ రాజకీయ లబ్థిని పొందింది. ఎన్నికల సంఘం ఫలితాల ప్రకటన సరళితో లెఫ్ట్‌కు పరాజయం, కాంగ్రెస్‌కు ఏకైక జయం దక్కాయి.

యుడిఎఫ్‌కు కేరళలో ఘన విజయం

140 అసెంబ్లీ స్థానాల కేరళలో కాంగ్రెస్ సారధ్య యుడిఎఫ్ 102 స్థానాలలో ఆధిక్యతతో దూసుకుపోవడం ప్రతిపక్షాలకు కొంతలో కొంత దన్ను దక్కిన స్థితిని కల్పించింది. ఇక్కడ ఎల్‌డిఎఫ్ బలం ఈసారి 35కు పరిమితం అయింది. ఎన్‌డిఎకు తిరువనంతపురంలో మూడు చోట్ల బిజెపి గెలుపుతో దక్కింది.

ఈ ఫలితం అక్రమం : మమత

బెంగాల్‌లోని మొత్తం 294అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి 195 స్థానాలు వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక్కడ ప్రభుత్వస్థాపనకు అవసరం అయిన సంఖ్యాబలం 147ను బిజెపి దాటేసింది. టిఎంసి బలం 90కి పరిమితం అయిం ది. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో ఎన్నికల సంఘం ఫలితాలను తారుమారు చేసేందుకు, టిఎంసి గెలిచిన స్థానాల ప్రకటనకు నిరాకరిస్తోందని, పలు పోలింగ్ కేంద్రాలలో టిఎంసి కార్యకర్తలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని మమత బెనర్జీ విమర్శించారు. అనేక చోట్ల మొదటి రెండో రౌండ్ కాగానే కౌంటింగ్ నిలిపివేశారని ఆరోపించారు. కళ్యాణిలో ఏడు మెషిన్లు చాలా హెచ్చుతగ్గుల లెక్కింపుతో పనిచేస్తున్నట్లు గుర్తించామని ఆమె విలేకరులకు తెలిపారు. టిఎంసి అభ్యర్థులు కానీ, కౌంటింగ్ ఏజెంట్లు కానీ అర్థరాత్రి అయినా అక్కడి కేంద్రాలను వదిలిపెట్టి వెళ్లరాదని కోరుతున్నట్లు

తెలిపిన మమత ఈ విషయంలో తమ కార్యక్రమం ఖరారు చేసుకునే దిశలో ఉన్నారు. బెంగాల్‌లో టిఎంసి ఎక్కువగా సర్ వివాదంపై బిజెపిపై విరుచుకుపడింది. నిజమైన ఓటర్లను తొలిగించివేశారని టిఎంసి ఆరోపించింది. అయితే బిజెపి కర్ మెడికల్ కాలేజీ ఇతర చోట్ల మహిళలపై దారుణ హత్యాచారాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, అరాచక గూండాల పాలన అవినీతి రాజ్యం సాగుతోందని ప్రచారం సాగించారు. బెంగాల్‌లో ఎన్నికల విధులు, తరువాతి కౌంటింగ్ దశలలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏకంగా రెండున్నర లక్షలకు పైగా కేంద్రీయ బలగాలు రంగంలోకి దిగాయి.రాష్ట్ర పోలీసులు వారికి సహకరించారు. బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వ ఏర్పాటు కాయం అయిందని బిజెపి నేత సువేందు అధికారి మధ్యాహ్నం ప్రకటించారు.

అసోం, పుదుచ్చేరి బిజెపి ఖాతాలోకి

అసోంలో ఎన్నికల ప్రచారం వాడిగా వేడిగా సాగింది. అయితే ముఖ్యమంత్రి హిమంత బిస్వా సారధ్యంలో తిరిగి బిజెపి అధికారం దిశలో దూసుకువెళ్లింది. ఇది వరుస ఘన విజయం అయింది. 126స్థానాల అసెంబ్లీలో బిజెపికి 81కి పైగా స్థానాలలో ఆధిక్యత లభించింది. పుదుచ్చేరిలో ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్, బిజెపిల కూటమి మొత్తం 30 స్థానాల్లోనూ 11కు పైగా స్థానాలలోఆధిక్యత లేదా గెలుపుతో నలిచింది. ఇక్కడ విజయ్ పార్టీ టివికె మూడు స్థానాలకు పరిమితం అయింది.