
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సెకండ్ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ‘తస్సాదియ్యా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 వేలకు పైగా రీల్స్‌తో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే యూ ట్యూబ్, షార్ట్ వీడియోస్‌లోనూ సాంగ్ అందరినీ అలరిస్తూ సాంగ్ ట్రెండ్ అవుతూ టాప్ రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఈ సెలబ్రేషన్ సాంగ్‌ను పర్ఫెక్ట్‌గా సంతో ష్ నారాయణన్ కంపోజ్ చేశారు. సమంత ఈ సినిమాలో కేవలం లీడ్ రోల్‌లో నటించటమే కా దు.. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.











