
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య వివాదం మరింత తీవ్రత రం అవుతోంది. దీంతో తుంగతుర్తి నియోజకవర్గం పంచాయితీపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించాల్సిన నివేదికను పెండింగ్‌లో పెట్టారు. శనివారం నివేదిక ఇవ్వాల్సి ఉండగా, రెండు రోజులుగా మళ్లీ ఎమ్మెల్యే మందుల సామేల్‌కు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నివేదికను పెండింగ్‌లో పెట్టారని తెలుస్తోం ది. తుంగతుర్తిలో మందుల సామేల్‌కు తానే టిక్కెట్ ఇప్పించానంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారని సామేల్ తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం తనకు టిక్కెట్ ఇచ్చిం దే తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. పైగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపైనా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ భగ్గుమన్నా రు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి ని యోజకవర్గంలో మంత్రి వెంకట్ రెడ్డి తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పర్యటించడం ఏమిటని ఆక్షేపించారు. ఎస్‌సి నియోజకవర్గంపై మీ అధిప త్యం ఏమిటని ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్ర శ్నించారు. చాలా కాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మందుల సామేల్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. ప ది రోజుల క్రితం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చారి మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమైనప్పుడు కూడా జిల్లాలో ఎమ్మెల్యేల ను కలుపుకుని పోవాలంటూ హితవు చెప్పారని పా ర్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే మందుల సామేల్ ఏకపక్షంగా పార్టీ మండల కమిటీలను ఏకపక్షంగా నియమించారని, కమిటీలన్నీ బిఆర్‌ఎస్ నేతలతో నింపేశారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యం లో ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ నాయకులు,
కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏకంగా గాంధీ భవన్‌కు వచ్చి ధర్నా ని ర్వహించారు. ఆ సమయంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి వారి నుంచి వినతి ప త్రం తీసుకుని శాంతింపజేసి పంపించారు. రెండు రోజుల విరామం తర్వాత వారు మళ్లీ వచ్చారు. దీం తో మహేష్ కుమార్ గౌడ్ ఈ సమస్యపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జగ్గా రెడ్డికి బాధ్యత అప్పగించారు. ఈ మేరకు జగ్గా రెడ్డి గత పది రోజులుగా విచారణ చేపట్టి జిల్లా మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించా రు. అయితే తుంగతుర్తి సమస్యను తాము పట్టించుకోబోమని చెప్పారు. కాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రె డ్డి గాంధీ భవన్‌లో జగ్గా రెడ్డితో సమావేశమైనా, తా నూ తుంగతుర్తిలో జోక్యం చేసుకోబోనని చెప్పారు.
మీ మునుగోడు సంగతి చూసుకో: సామేల్
కాగా నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాం గ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారంటూ మందుల సామేల్ మండిపడ్డారు. తాను యాభై వేల మెజారిటీతో గెలుపొందానని, వేముల వీరేశం అరవై వేల మెజారిటీతో గెలుపొందారని చెప్పారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గం పరిస్థితి అస్సలు బాగాలేదని తనకూ నివేదిక వచ్చిందని, కాబట్టి మీ సంగతి చూసుకోవాలని సామేల్ హితవు చెప్పారు.ఇలా మాటల తూటాలతో ఇరువురి మధ్య వివాదం తీవ్రతరం కావడంతో ఈ సమయంలో నివేదిక ఇస్తే అసంపూర్తిగా ఉంటుందని భావించిన జగ్గా రెడ్డి తన నివేదికను వాయిదా వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.











