
నేటి వేగవంతమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, బరువు పెరగడం లేదా నీరసంగా అనిపించడం వంటి చిన్న సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. దీనివల్ల చాలామంది డాక్టర్లను ఆశ్రయించి మందులను వాడుతుంటారు. అయితే వంటింట్లోనే లభించే రెండు మసాలా దినుసులను ఉపయోగించి ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా? అవును, నిజమే!వంటగదిలో కనిపించే జీలకర్ర- సెలెరీ నీరు దాదాపు అని ఆరోగ్య సమస్యలను దూరం చేసి, శరీరాన్ని ఎంతో ఆరోగ్యాంగా, శక్తివంతంగా ఉంచుతుంది. మరి ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కలిగే లాభాలేమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర-సెలరీ నీటి ఆరోగ్య ప్రయోజనాలు
1. జీలకర్ర, సెలెరీ రెండింటిలోనూ జీర్ణక్రియను మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి.
2. ఈ నీరు జీవక్రియను వేగవంతం చేసి, శరీరం కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
3. జీలకర్ర, సెలెరీ నీరు శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచుతుంది.
4. ఈ రెండు మసాలా దినుసులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
5. ఈ నీరు కడుపు నొప్పి, ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది
6. శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది.
జీలకర్ర - సెలెరీ నీటిని ఎలా తయారు చేయాలి?
ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ జీలకర్ర, సెలెరీని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అలాగే రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నేదీనిని మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి తాగాలి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.












