నవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ ఎండలు మండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు, ముగజీవాలు దాహార్తికి అల్లాడుతున్నాయి. నేపథ్యంలో మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు, కొనుగోలు కేంద్రములో ధాన్యం తూకం వేసే హమాలి కార్మికులకు ఎండనుంచి ఉపశమనం కోసం గ్రామ ఉప సర్పంచ్ రాజేందర్ మజ్జిక ప్యాకేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అజ్మీరా సమ్మయ్య,యూత్ నాయకులు అడ్వాల రాజు, రమేష్, కవిత పాల్గొన్నారు.
The post ఉపాధిహామీ కూలీలకు మజ్జిక ప్యాకేట్స్ అందజేత appeared first on Navatelangana.















