భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని శిఖర్ ధవన్ ప్రశంసలతో ముంచెత్తాడు. చిన్న వయసులో పరిణతితో ఆడటం సాధారణ విషయం కాదని అన్నాడు. స్ట్రోక్ ప్లేతో పాటు నిర్భయంగా ఆడే మనస్తత్వం అతడి సొంతమని తెలిపాడు. 15 ఏళ్ల వయసులోనే స్టార్ బౌలర్లపైనా ఆధిపత్యం ప్రదర్శించడం అద్భుతమన్నాడు.

‘‘కేవలం దూకుడుగా ఆడటంతోనే వైభవ్ సూర్యవంశఈ హైలైట్ కావడం లేదు. అతడిలో మరో ప్రత్యేకత ఉంది. ఎలాంటి షాట్‌‌నైనా మనుసు పెట్టి ఆడతాడు, నైపుణ్యంతో పాటు ఇలాంటి అలవాటు ఉంటే అతడిని ఆపడం చాలా కష్టం. పిన్న మయసులోనే ఆ సత్తాను అందుకోవడం అభినందనీయం. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లకే అడుగు పెట్టడమే అతడు సాధించిన అతి పెద్ద ఘనత. ఐపిఎల్‌లోనూ ఫోర్లు, సిక్సులు చాలా దూకుడుగా బాదేవాడు. మున్ముందు కూడా అతడి భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది’’ అని ధవన్ తెలిపాడు.