నవతెలంగాణ – హైదరాబాద్ : న్యూఢిల్లీలోని కల్‌ కాజీలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్‌కాజీలోని సుమిత్ అకాడమీలో ఓ విద్యార్థినిపై టీచర్ సుమిత్ సెహగల్ అతి దారుణంగా దాడి చేశాడు. కర్రతో కొడుతూ, కాలితో తన్నుతూ, జుట్టు పట్టుకొని ఈడ్చిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దాడికి గల కారణాలు తెలియరాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

The post విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్ appeared first on Navatelangana.