మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో, దౌల్తాబాద్: లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి.. కార్యకర్తలు, నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రాలను పల్లీబ, బఠానీల్లా రూ.కోట్లకు అమ్ముకున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాడ్ చేశారు. ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు,

రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీపై పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఆందోళన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఎం స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేసినందుకు ్ల జంతర్‌మంతర్ నుంచి చలో పా ర్లమెంట్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో, పార్టీల కా ర్యకరలు తీసుకోలేదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. ప్రశ్నపత్రాలను అమ్ముకున్నోళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి.. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళ్తున్న వేలాది మంది విద్యార్థులపై లాఠీఛార్జీలతో, బాష్పవాయు గోళాలతో చేసిన దాడి పాశవికమని అన్నారు.

లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ ప్రశ్నపత్రాల లీకేజీ, కేంద్ర ప్ర భుత్వ వైఫల్యం, ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్‌కు సంబంధిం చి పార్లమెంటులో చర్చకు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కాంగ్రెస్‌పార్టీ, ‘ఇండియా’ కూటమి అడిగితే.. ప్రభు త్వం అనుమతి ఇవ్వడంలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సీబీఎస్‌ఈ పరీక్షల కుంభకోణం గురించి కూడా చర్చ జరగకుండా అడ్డుకున్నారని అన్నారు.ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కొడితే ముక్కులో నుంచి రక్తం కారిందని అన్నారు. “దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్‌గాంధీ మొదటివాడు కా దు. చివరివాడు కాదు. ఆనాడు మహాత్మాగాంధీ ముప్పై ఏళ్లు తెల్లదొరలతోని కొట్లాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిండు. ముప్పై ఏళ్లలో తెల్లదొరలు మహాత్మాగాంధీపై లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. అలాంటి మహాత్మా గాం ధీని స్వాతంత్య్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే తు పాకీ తూటాలకు బలైపోయిండు’‘ అంటూ సీఎం వివరించారు. పేదల కోసం అమ్మగా మారిన ఇందిరమ్మ ఏకే -47 తుపాకీ తూటాలకు నేలకు ఒరిగిందన్నారు.


గ్లోబరీనా.. కేటీఆర్ బినామీ సంస్థ

గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ అని సిఎం ఆరోపించారు. ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాల్లో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభు త్వం మీద కొట్లాడితే గ్లోబరీనా సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని కోర్టులు ఆదేశించాయి. కానీ కేటీఆర్ బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టు చేసి జైలుకు పంపలేదు. వాళ్ల పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. వాళ్లు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వా ళ్లకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు అని సిఎం చెప్పా రు. ఈ సర్టిఫికెట్‌ను తీసుకొని 2023 డిసెంబర్ 7న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత... ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు

మార్చుకొని సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ ప్రశ్నపత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్ , కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆ టెండర్‌లో కేవలం వాళ్లకు సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు అనుకూలంగా నిబంధనలు పెట్టి సీబీఎస్‌ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్టు తీసుకొని... అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్ష పత్రాలను దిద్దింది రద్దు చేసి సీబీఎస్‌ఈ మళ్లీ పరీక్ష పత్రాలను దిద్దాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం అన్నారు. కేటీఆర్ ఢిల్లీ బీజేపీ వాళ్లతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించిండు. ఆ విధంగా సీబీఎస్ ఈ పరీక్షలు, ప్రశ్నపత్రాల కుంభకోణాలకు పాల్పడ్డప్పు డు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్ష నిర్వహించే వాళ్లకు కూడా ధైర్యం వచ్చింది. దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చిందని తెలిపారు.