ఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని సిజెపి నేతలు తెలిపారు. మిగతా 3 డిమాండ్లు కూడా నెరవేరేవరకు వేచి ఉందాం అని అన్నారు. ఈ సందర్భంగా సిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిజెపి నేతలు సూచించారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, దాడిచేసిన పోలీసు అధికారులు తమకు క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన చేసేవరకు ఈ ఉద్యమం ఆగదని, సాయంత్రం 6.గం.లకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తమకు రాజకీయాలు అవసరం లేదని సిజెపి నేతలు పేర్కొన్నారు.