
అమరావతి: దైవ దర్శనానికి వెళ్తుండగా ఆగి ఉన్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... విశాఖపట్నం, విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు రాయగడకు వెళ్లేందుకు వ్యాన్‌ను బుక్ చేసుకున్నారు. విజయనగర జిల్లా కేంద్రానికి సమీపంలోని చెల్లూరు దగ్గర వ్యాన్‌ను ఆపారు. ఓ లారీ అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొట్టి అనంతరం 500 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడితో సహా ఇద్దరు మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు రామునాయుడు(50), మజ్జి నారాయణరావు(50), బి మోహన్‌నాయుడు(08) గుర్తించారు.








