ఈ రోజు హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ పేలడంతో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:29 గంటలకు విమానం చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఈ ఘటన జరిగింది. విమానం రన్‌వేపై ల్యాండ్ అయి పార్కింగ్ బే వైపు వెళ్తున్న సమయంలో, ఒక ప్రయాణికుడి వద్ద ఉన్ పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలి మంటలు వచ్చాయి. దీంతో క్యాబిన్ అంతా పొగతో నిండిపోయింది. పొగ రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కేబిన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది వెంటనే మంటలు ఆర్పే పరికరాలు ఉపయోగించి మంటలను అదుపు చేశారు. ఘటన సమయంలో విమానంలో మొత్తం 198 మంది ప్రయాణికులు, ఇద్దరు చిన్నారులు మరియు ఆరుగురు సిబ్బంది ఉన్నారు.