
హైదరాబాద్: రాజమండ్రి యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రియాంక తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు.
ప్రియాంక స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్. ఎంబిబిఎస్ పూర్తి చేసి రాజమండ్రిలో పిజి చదువుతున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి వాహనంపై వెళ్తుండగా.. దుష్యంత్, ఆండ్రూ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వీరి వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి.











