ముంబై: బాలీవుడ్ నటి, ఎంపి కంగనా రనౌత్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆమె తన ఇంటి నుంచి కారు ఎక్కేందుకు వస్తున్న వీడియో అది. అయితే అందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా..? ఈ వీడియో కంగనా మెడలో నల్లపూసల దండతో కనిపించింది. నల్లపూసలు, మట్టిగాజులతో కంగనా కనిపించడంతో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కంగన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్‌ చేయగా.. ఆమె పెళ్లి జరిగితే తప్పకుండా గ్రాండ్‌గా చేసుకుంటారని మరొకరు అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే, అది సినిమా షూటింగ్‌ కోసం వేసుకున్న గెటప్‌ అని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కంగనా ముంబైలో ఉంటున్నారు. తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ సీక్వెల్‌లో నటిస్తున్నారు. ‘క్వీన్-2’ అనే టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమాలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా సంప్రదాయబద్ధంగా తయారైనట్లు తెలుస్తోంది.


zzz