హైదరాబాద్: ఎల్‌నినోను ఎదుర్కొని ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మహా వరుణ యాగం’ చేపట్టింది. రాష్ట్రంలో వర్షాలు పడాలని నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ విజయ్‌ విహార్‌ టూరిజం గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలో వరుణయాగం కార్యక్రమం చేపట్టారు.108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. వరుణయాగంలో భాగంగా మహా పూర్ణాహుతిలో సిఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.